డీఎస్పీకి దేవి శరన్నవరాత్రుల ఆహ్వానం

BDK: కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్‌కు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే దేవి శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రాన్ని గురువారం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. రామాంజనేయ కాలనీలో సాయి గణేష్ దత్త మందిరంలో నిర్వహించబోయే దేవి శరన్నవరాత్రుల ఆహ్వానం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్ పాల్గొన్నారు.