పరగడుపున వేప ఆకులు నమిలితే?
వేప ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ఉదయాన్నే వేపాకులు నమిలితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. నోటి దుర్వాసనను తగ్గించి చిగుళ్లను బలోపేతం చేస్తాయి. శరీరంలోని మలినాలను తొలగించడం ద్వారా కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మంపై సానుకూల ప్రభావం చూపుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గించి మెరిసే చర్మాన్ని పొందడానికి సహాయపడతాయి.