పాతాలానికి చేరిన గంగమ్మ

పాతాలానికి చేరిన గంగమ్మ

WGL: జిల్లాలో భూగర్భ జలమట్టాలు పాతాలానికి చేరాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా ఈ యేడు భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఫిబ్రవరి నుంచే రైతులు సాగునీటి కోసం అల్లాడిపోయారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో బోర్లు, బావుల్లో నీటి జాడ కరుమరుగై పోవడంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి చేతీకి రాకుండ పోయాయి. అధికారులు చర్యలు చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.