పోలింగ్.. స్పృహ తప్పి పడిపోయిన అధికారి
TG: మహబూబాబాద్ జిల్లాలోని పోలింగ్ కేంద్రంలో ఓ అధికారి స్పృహతప్పి పడిపోయారు. కురవి మండలం చంద్యాతండా పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. బీపీ తగ్గడంతో పోలింగ్ అధికారి శ్రీనివాస్ పడిపోయారు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. రిజర్వులో ఉన్న మరో అధికారిని పోలింగ్ కేంద్రానికి అధికారులు పంపించారు. దీంతో యథావిధిగా పోలింగ్ కొనసాగుతోంది.