నేవీ చరిత్రలో సరికొత్త అధ్యాయం

నేవీ చరిత్రలో సరికొత్త అధ్యాయం

సొంత సాంకేతికతతో నిర్మించిన INS హిమగిరి, INS ఉదయగిరి యుద్ధ నౌకలను రేపు విశాఖలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ వేడుకకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ నౌకలు ఇండో-పసిఫిక్, చైనా సరిహద్దుల భద్రతకు దోహదపడి, భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయనున్నాయి. ఏకకాలంలో రెండు నౌకలను ప్రారంభించడం నేవీ చరిత్రలో మైలురాయిగా నిలవనుంది.