'ప్రతి నష్టాన్ని అంచనా వేయాలి'
VZM: జిల్లాలోని అన్ని జలాశయాల ఇన్ఫ్రా, అవుట్‌లేట్‌ను పర్యవేక్షిస్తూ ఎక్కడా నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా తుఫాన్, వరద పరిస్థితులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు నీటి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం ప్రతి నష్టాన్ని నమోదు చేసి, అంచనా వేయాలని ఆదేశించారు.