ఊటీని తలపిస్తున్న రాయదుర్గం పరిసర ప్రాంతాలు

ఊటీని తలపిస్తున్న రాయదుర్గం పరిసర ప్రాంతాలు

ATP: రాయదుర్గం పట్టణాన్ని పొగ మంచు కమ్మేయడంతో ఊటీ ప్రాంతాన్ని తలపించింది. శనివారం కొండ ప్రాంతాన్ని మరియు పరిసర ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా అలుముకోవడంతో అద్భుత దృశ్యాలను స్థానిక ప్రజలు ఆశ్చర్యంగా తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. పొగ మంచు ప్రభావం పెరగడంతో చలి గాలుల తీవ్రత పెరిగింది. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు సూచిస్తున్నారు.