కరెంటు షాక్‌తో యువకుడు మృతి
SRPT: పెన్‌పహాడ్ మండలం గుడిపూడి తండాలో విద్యుత్ షాక్‌తో యువకుడు హరిలాల్ బుధవారం మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు గ్రామంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తండా వాసులు మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.