ఎంపీ శివనాథ్‌ను కలిసిన నిర్మాత అశ్వినీదత్
NTR: టాలీవుడ్ అగ్ర నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ శనివారం విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన అశ్వినీదత్‌కు ఎంపీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వారిద్దరూ చర్చించుకున్నారు.