గూగుల్కు అప్పన్న భూముల లీజు.. ఏటా రూ.26 కోట్ల ఒప్పందం
VSP: గూగుల్ డేటాసెంటర్ కోసం సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని 11 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. అడవివరం, ముడసర్లోవలోని భూములను APIICకి అప్పగించేందుకు దేవాదాయశాఖ అనుమతి ఇచ్చింది. లీజు ప్రకారం ఏటా రూ. 26.45 కోట్లు చొప్పున చెల్లింపులు ఉండనున్నాయి. ప్రతి ఐదేళ్లకు లీజు మొత్తాన్ని 5% పెంచే విధంగా నిబంధనలు పెట్టారు.