డ్రంకెన్ డ్రైవ్.. ముగ్గురికి జైలు శిక్ష
KNR: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు కోర్టు నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది. ఇటీవల పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ఎం.ప్రశాంత్, బి. గంగరాజు, బి. జయరాంలను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరచగా, నేరం రుజువు కావడంతో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఈ తీర్పునిచ్చారు. అనంతరం వీరిని జైలుకు తరలించారు.