5జీ ఫోన్‌లతో పని మరింత వేగం
ASR: మారుతున్న కాలానికి అనుగుణంగా వెలుగు వీవోఏలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కొయ్యూరు వెలుగు ఏపీఎం సాధన సూచించారు. మంగళవారం వెలుగు కార్యాలయంలో, మండలంలో పనిచేస్తున్న 47 మంది వీవోఏలకు 5జీ సెల్ ఫోన్‌లను పంపిణీ చేశారు. 5జీ ఫోన్‌ల ద్వారా గ్రూపుల డేటా ఎంట్రీ, రిపోర్టింగ్ ప్రక్రియ, ప్రభుత్వ పథకాల సమాచారం మరింత వేగవంతం అవుతుందన్నారు.