మాగంటి సునీత గెలుపు ఖాయం: ఎర్రబెల్లి
JN: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో మాగంటి సునీత గెలవబోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎర్రబెల్లి కొడకండ్ల మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి సునీతను గెలిపించాలని ఆయన ఓట్లు అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.