IPL 2025: గుజరాత్‌కు అదిరిపోయే శుభవార్త

గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడాపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి భారీ ఊరట లభించింది. రబాడాపై ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. రబాడాపై తొలగించిన నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో అతడు వెంటనే గుజరాత్ జట్టుతో చేరేందుకు మార్గం సుగమమైంది.