'శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలి'

'శాంతియుతంగా  ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలి'

PDPL: శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు అందరు సహకరించాలని బసంత్ నగర్ ఎస్సై శ్రీధర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి మండలం ఈశాలతక్కళ్లపల్లి, పాలకుర్తి గ్రామాల్లో ప్రజలకు, అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చట్టవిరుద్ధమన్నారు.