చింతపల్లిలో ఆక్రమణలు గుర్తించేందుకు సర్వే: ఎంపీడీవో

ASR: చింతపల్లి మండలంలో ఆక్రమణలకు గురైన భూములను గుర్తించడానికి సమగ్ర సర్వే చేపట్టాలని ఎంపీడీవో శ్రీనివాసరావు ఆదేశించారు. ఎంపీడీవో ఆఫీసులో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బందితో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న గ్రామ కంఠం స్థలాలు, పంచాయతీ భూములు, ప్రభుత్వ భూములు సర్వే చేయాలని ఆదేశించారు.