వాటర్ ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన టీచర్

వాటర్ ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన టీచర్

TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ హాస్టల్‌లో.. ప్రిన్సిపాల్ మీద కోపంతో సైన్స్ టీచర్ తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపింది. 13 మంది విద్యార్థులు, ఓ టీచర్ అస్వస్థతకు గురయ్యారు. అధికారులు అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.