గండి అంజన్నను దర్శించుకున్న రాజంపేట MLA

గండి అంజన్నను దర్శించుకున్న రాజంపేట MLA

KDP: చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామిని బుధవారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు కేసరి, రాజా రాజేశ్లు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అంజన్న సన్నిధిలో కుటుంబ సభ్యుల పేరిట అర్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, వైసీపీ నాయకులు ఉన్నారు.