'తప్పనిసరి పరిస్థితుల్లోనే అంబటి దీక్ష చేస్తున్నారు'
GNTR: రాజకీయాల్లో మాజీమంత్రి అంబటి రాంబాబు ఫైర్ బ్రాండ్ అని మాజీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అన్నారు. 'తప్పనిసరి పరిస్థితుల్లోనే అంబటి దీక్ష చేస్తున్నారు. అంబటి ధర్మపోరాటం వ్యక్తిగతం కాదు.. వైసీపీ పోరాటం. చట్టాలు.. మీ చట్టాలు కాదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అన్నారు. కాగా, అంబటి కలెక్టరేట్ ముందు ఇవాళ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.