ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే

వనపర్తి: పెద్ద మందడి మండలం మంగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ నెంబర్ 66లో వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి తన ఓట్లు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి శారదమ్మ ఓటు వేశారు. ప్రతి ఒక వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం పార్టీ సహచరులతో ఫోటో దిగారు.