రాష్ట్రాభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: సీఎం
AP: విజయవాడలో ఐజేయూ ప్లీనరీ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉంటున్నాయని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సోషల్ మీడియా అతి పెద్ద సమస్యగా ఉందని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని.. అయితే పాజిటివ్ న్యూస్ ఇవ్వమని కోరడం లేదని స్పష్టం చేశారు.