అక్రమంగా తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
TPT: రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్లో కాకిరేవులపెంట వద్ద పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను సిబ్బంది పట్టుకున్నారు.