VIDEO: ఖానాపూర్‌లో చింత చెట్టుకు మంటలు
MBNR: జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామంలో మంచాల సత్తయ్య ఇంటి ఆవరణలో ఉన్న చింత చెట్టుకు అర్ధరాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు, జడ్చర్ల అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా అనేది తెలియాల్సి ఉంది.