ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే భూమిపూజ
GDWL: గద్వాల పట్టణంలోని 9వ వార్డు రాఘవేంద్ర కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆదివారం భూమిపూజ చేశారు. ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ జయలక్ష్మి, స్థానిక కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.