విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధం

విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధం

WNP: జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొన్నారు. విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.