నేడు జాతీయ లోక్ అదాలత్
KDP: జిల్లా వ్యాప్తంగా నేడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 29 బెంచీలు ఏర్పాటు చేస్తుండగా ఒక్కో బెంచికి ఒక న్యాయమూర్తి, ఇద్దరు సభ్యులు ఉంటారన్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు నిర్వహిస్తామన్నారు.