VIDEO: అకాల వర్షంతో రైతులకు ఇబ్బంది...!
GDWL: ఐజ మండలం బింగిదొడ్డి స్టేజీ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఈదురు గాలితో కూడిన అకాల వర్షం కురిసింది. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, మామిడి సాగు చేస్తున్న రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో గాలివాన రావడంతో కాయలు రాలిపోయి భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.