సూర్యాపేటలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్
SRPT: తక్కువ ధరకు బంగారం ఇస్తామని ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండకు చెందిన వెంకటేశ్వర రావు నుంచి రూ.12 లక్షలు తీసుకుని నకిలీ బంగారం అంటగట్టిన ఈ ముఠా గుట్టును ఎస్పీ నరసింహ రట్టు చేశారు. ప్రజలు ఇలాంటి మోసాలను నమ్మవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్సై బాలునాయక్ ఉన్నారు.