VIDEO: నగరపాలక సంస్థ కార్యాలయంలో పీజీఆర్ఎస్
NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వద్ద నుంచి మొత్తం 53 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు.