హైవేపై లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
TPT: పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈప్రమాదంలో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.