VIDEO: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
RR: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ను పేల్చేస్తామని ఇండిగో ఎయిర్ లైన్స్ ఆఫీస్‌కి బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అధికారులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మరోవైపు దేవాలయాలు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు.