VIDEO: 'నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రమాదాలు పెరుగుతాయి'

VIDEO: 'నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రమాదాలు పెరుగుతాయి'

ఆసిఫాబాద్ (M) బూరుగుడ గ్రామంలో నాలుగో విడత “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, వేగ పరిమితి పాటించడం తప్పనిసరని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరించారు. అనంతరం పోలీసులు, గ్రామ ప్రజలు రోడ్డు భద్రత పాటించాలని ప్రతిజ్ఞ చేశారు.