మొండి గొల్లమంద రోడ్డు బలోపేతానికి చర్యలు

మొండి గొల్లమంద రోడ్డు బలోపేతానికి చర్యలు

కృష్ణా: గొల్లమంద రోడ్డు బలోపేతానికి చర్యలు తీసుకున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగాయలంక మండలం ఎదురుమొండి నుంచి గొల్లమంద వరకూ కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న రోడ్డు మార్గం ఇటీవల కృష్ణానది ప్రవాహ ఉధృతికి కోతకు గురైంది. ఈ నేపథ్యంలో నూతన రోడ్డు నిర్మాణం జరిగే వరకూ కరకట్ట రోడ్డు పటిష్టం చేస్తున్నట్టు తెలిపారు.