నిరుద్యోగులకు గుడ్ న్యూస్!
NGKL: నాగర్ కర్నూల్‌లో జిల్లా ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 23న ఉదయం 10:30 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రాఘవేందర్ సింగ్ తెలిపారు. ఓ బయో ఫెర్టిలైజర్స్ సంస్థలో 50 ఖాళీల భర్తీకి ఈ మేళా జరుగుతుందన్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి, 25-30 ఏళ్ల లోపు వయసున్న నిరుద్యోగ యువత తమ ధ్రువపత్రాలతో హాజరవాలని ఆయన కోరారు.