ఢిల్లీకి బయలుదేరిన కేంద్రమంత్రి బండి సంజయ్
ఢిల్లీ పేలుడు ఘటనతో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఢిల్లీ సీపీ, కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిపై ఆరా తీశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పేలుడు ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించనున్నారు. అనంతరం ఎర్రకోట వద్దకు వెళ్లి పరిశీలించనున్నారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది.