MLA పేరుతో డబ్బు వసూలు.. వ్యక్తి అరెస్ట్

TPT: చంద్రగిరి MLA పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి రూరల్(M) గాంధీపురానికి చెందిన తేజా MLA నాని, ఆయన భార్య సుధారెడ్డి పేర్లు చెప్పి ప్రజల నుంచి రూ.49,300 వసూలు చేశాడు. ఈ మేరకు MLA పీఏ వినోద్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి, తేజాను అదుపులోకి తీసుకున్నారు.