అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో  సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కళ్యాణ క్రతువు నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై పండువెన్నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించారు.