బైక్ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో జరిగిన బైక్ దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకొని రిమాండు తరలించినట్లు SI సర్తాజ్ పాషా తెలిపారు. మండల కేంద్రంలో ఓ ఇంటి వద్ద నిలిపి ఉన్న బైక్ దొంగలించినట్లు కేసు నమోదైంది. నిందితుడిని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి జడ్జి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు