'రైతులు, ప్రజలు మోంథా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి'
SRCL: రుద్రంగి మండల రైతులు, ప్రజలు మోంథా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుష్పలత సూచించారు. రెండు రోజులపాటు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఉన్నందున రైతులు జాగ్రత్త పాటించాలన్నారు. వాతావరణ కేంద్ర సూచనల మేరకు రెండు రోజులలో(28, 29 తేదీలలో)భారీ వర్షాల నేపథ్యంలో వరి కోయని రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలన్నారు.