చలికి తట్టుకోలేక వృద్ధురాలు మృతి

చలికి తట్టుకోలేక వృద్ధురాలు మృతి

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామంలో శుక్రవారం ఉదయం నార్లగిరి బుచ్చమ్మ అనే వృద్ధురాలు చలిని తట్టుకోలేక మృతి చెందారు. ఆమె భౌతికకాయానికి కాంగ్రెస్ నాయకులు, 64వ డివిజన్ కార్పొరేటర్ బైరి లింగమూర్తి, మాజీ మండల ఉపాధ్యక్షుడు బిల్లా రవీందర్, మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘుచందర్, పలువురు డివిజన్ అధ్యక్షులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.