'సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

KDP: గ్రామాల్లో సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన లింగాలలో వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.