వార్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన గుడ్ల ధర.!
NZB: జిల్లాలో గుడ్లు ధరలు భారీగా పడిపోయాయి. 2 నెలల క్రితం రూ.8 వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.4.25–రూ.4.50కు చేరింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సముద్ర రవాణా అంతరాయం కలగడంతో పశ్చిమాసియా దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఉత్పత్తి అయిన గుడ్లు స్థానిక మార్కెట్లలోనే అమ్మాల్సి రావడంతో ధరలు తగ్గుతున్నాయి. ఎండల కారణంగా వినియోగం తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది.