నల్గొండలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
NLG: వన్ టౌన్ పోలీస్ పరిధిలో వారం క్రితం జరిగిన మూడు దొంగతన కేసులను సీసీ టీవీ ఆధారంగా విచారించిన పోలీసులు, కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ రుద్రాక్షి శ్రీనును పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ కే. శివరాం రెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్ టీమ్ మరియు వన్ టౌన్ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన చర్యలో సుమారు రూ.12 లక్షల విలువైన ఆభరణాలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.