వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న తుని ఎమ్మెల్యే
కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని తుని ఎమ్మెల్యే యనమల దివ్య కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.