పంట నష్ట సాయం రైతులకు వరం: ఎమ్మెల్యే
ATP: పంట నష్ట సాయం రైతన్నలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో రైతుల కన్నీరు తుడుస్తుందన్నారు. గత ఏడాది ఆక్టోబర్ నెలలో భారీ వర్షాలతో నష్టపోయిన ఉద్యానవన పంట రైతులకు రూ. 4.82 కోట్ల సాయానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.