డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారిపై ప్రత్యేక తనిఖీలు
HYD: నగరంలో నేటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్, LLR తీసుకునేందుకు సమయం ఇస్తారు. న్యాయస్థానంలో జరిమానా చెల్లించి వాహనం తీసుకెళ్లవచ్చు. లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇచ్చే యజమానులపైనా చర్యలు తప్పవని ట్రాఫిక్ జాయింట్ CP జోయల్ డేవిస్ తెలిపారు.