VIDEO: ఆర్టీసీ ఖమ్మం రీజియన్ స్టాండింగ్ న్యాయవాదిగా రామకృష్ణ
KMM: జిల్లా కోర్టులో గత 27 సంవత్సరాలుగా న్యాయవాదిగా పని చేసిన ఉబ్బన రామకృష్ణ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ స్టాండింగ్ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఖమ్మం RM సరిరామ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తానని, తగిన న్యాయం చేకూరుస్తానని అన్నారు.