VIDEO: తాగునీటి కోసం తప్పని తిప్పలు
SKLM: రణస్థలం మండలంలో దారుణ పరిస్థితి నెలకొంది. పైడిభీమవరం పంచాయతీ దేవునిపాలవలస గ్రామ ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలో భారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ, వారు చలమల వద్ద గెడ్డల వరకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. దీనిపై అధికారులకు వినవచ్చినప్పటికీ సమస్య పరిష్కారం చేయకపోడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.