దేశంలో భారీ స్థాయిలో వాట్సాప్ ఖాతాలు బ్లాక్!
దేశంలో పెరుగుతున్న డిజిటల్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు మొత్తం 83,867 వాట్సాప్ అకౌంట్లను బ్లాక్ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 3,962 స్కైప్ ఐడీలను, 827 మొబైల్ యాప్‌లను కూడా తొలగించినట్లు చెప్పారు. అలాగే 8.45 లక్షల సిమ్ కార్డులను, 2.39 లక్షల మొబైల్ ఐఎంఈఐ నెంబర్లను బ్లాక్ చేశారు.