మెదక్ డిపో సందర్శన

MDK: మెదక్ ఆర్టీసీ డిపోను HYD జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుష్రో షా ఖాన్ సందర్శించారు. గ్యారేజ్, ట్రాఫిక్ సెక్షన్, బస్ స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రాఖీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసులు, ఛార్జీల వివరాలను డిపో మేనేజర్ సురేఖను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ ఈ.డీ. సెక్రటరీ శ్రీనివాస్ ఉన్నారు.